ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు సినీ ఫక్కిలో అరెస్టు చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించింది. తనపై ఉన్న కేసుల కారణంగా చింతమనేని గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి చింతమనేని వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఏలూరు: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 12 రోజులుగా చింతమనేని అజ్ఞాతంలో ఉన్నారు. భార్యకు ఆరోగ్యం బాలేదని తెలిసి అజ్ఞాతం వీడి బయటికి వచ్చారు. చింతమనేని కోసం నిఘా పెట్టిన పోలీసులు వెంటనే ఆయన్ని అరెస్టుచేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ తలెత్తకుండా పోలీసులు చింతమనేని ఇంటి దగ్గర భారీ స్థాయిలో మోహరించారు.
చింతమనేని ఇంటి దగ్గర నేటి ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. చింతమనేని ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలపై చింతమనేని అనుచరులు అభ్యంతరం తెలిపారు. పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. చింతమనేని లొంగిపోతారని చెప్పినా ఎందుకు సోదాలంటూ అనుచరులు నిలదీశారు. దళితులను కులం పేరుతో దూషించారని ఆయనపై కేసు నమోదైంది. అరెస్టు తప్పదని తెలిసి ఆయన కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు.