చిరంజీవి హీరోగా నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాను భారీ రేట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో మైత్రీ సంస్థ నేరుగా రిలీజ్ చేస్తున్నప్పటికీ వాల్యూ ఫిక్స్ చేశారు. ఈ మేరకు మైత్రీ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీ స్టార్ట్ చేసి, హైదరాబాద్ లో ఆఫీస్ కూడా తెరిచారు.
నైజాంలో ఈ సినిమాను 18 కోట్ల రేషియోలో రిలీజ్ చేస్తున్నారు. ఇక నైజాం తర్వాత అత్యథికంగా సీడెడ్ లో 15 కోట్ల రూపాయలకు ఈ సినిమాను అమ్మారు. ఓవరాల్ గా ఏపీ,నైజాంలో ఈ సినిమాను 72 కోట్ల రూపాయలకు అమ్మారు.
వరల్డ్ వైడ్ చూసుకుంటే, ఈ సినిమా 88 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 90 కోట్ల రూపాయలైనా రావాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి
నైజాం – 19 కోట్లు
సీడెడ్ – 15 కోట్లు
ఉత్తరాంధ్ర – 10.2 కోట్లు
ఈస్ట్ – 6.50 కోట్లు
వెస్ట్ – 6 కోట్లు
గుంటూరు – 7.50 కోట్లు
కృష్ణా – 5.60 కోట్లు
నెల్లూరు – 3.20 కోట్లు