కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్ 40 నిమిషాలు మాత్రమే సినిమాలో ఉంటుందట. అలాగే పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్… ఆచార్యలో కాజల్ !! వెనుక మెగా మాఫియా ?
నిజానికి మొదట చరణ్ ఒక గెస్ట్ రోల్ వేయాలని అనుకున్నారట. కానీ ఆ పాత్ర లెంత్ పెరుగుతూ రావడంతో పూర్తిస్థాయిలో నటించాల్సి వచ్చిందట. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ ను ఇచ్చారు సినీ క్రిటిక్ ఉమైర్ సంధు. చిరంజీవి ఆచార్య సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉందని చరణ్, చిరంజీవి ల నుంచి అభిమానులు ఏ అంశాలను కోరుకుంటారో ఆ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
బ్రహ్మానందం సినిమాలలో కనిపించకపోవటానికి కారణం ఇదేనా ?
చరణ్ చిరు కాంబినేషన్ స్సీన్స్ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని పేర్కొన్నారు. రామ్ చరణ్ కూడా తన నటనతో మెప్పించాడని అన్నారు. ఆచార్య సినిమా పైసా వసూల్ మూవీ అని కామెంట్ చేశారు.
ఎన్టీఆర్, కృష్ణలు అప్పుడు అలా… బాలయ్య మహేష్ ఇప్పుడు ఇలా
సినిమాకు 4 /5 రేటింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈ విషయంలో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.