ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి చేసుకొని, శంకర్ దర్శకత్వంలో సినిమాకు రాంచరణ్ రెడీ అయ్యారు. వీలైనంత త్వరగా సినిమా కంప్లీట్ చేయాలన్న కండిషన్ తో శంకర్-చరణ్ లు జతకట్టారు. అధికారికంగా సినిమా ఇప్పటికే పట్టాలెక్కగా… ఓ స్పెషల్ సెట్ లో రెగ్యూలర్ షూట్ కూడా మొదలైపోయింది.
అయితే, చరణ్ ఆచార్యలో ఓ రెండు పాటలు పూర్తి చేయాల్సి ఉంది. ఒకటి చిరంజీవి-చరణ్ లు చేయాల్సి ఉండగా, మరో సాంగ్ చరణ్-పూజా హెగ్దేపై షూట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే దసరా బరి నుండి తప్పుకున్న ఆచార్య… షూట్ పూర్తైన తర్వాతే శంకర్ సినిమాతో జాయిన్ అవ్వు అంటూ చరణ్ కు చిరంజీవి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆచార్య మూవీని వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేసే అవకాశం ఉండగా… చిరంజీవి సరసన కాజోల్ నటిస్తోంది. మ్యాట్నీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.