మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. కాగా నిన్న సాయంత్రం హైదరాబాద్ శివారులో ఓ ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.
చిరంజీవి రామ్ చరణ్ పై ఒక సాంగ్ షూట్ ఇక్కడ చేయబోతున్నారట. మెగా అభిమానులను ఆకట్టుకునే విధంగా ఈ సాంగ్ ఉండనుందట. ఈ నెలాఖరులోగా ఆచార్య మొత్తం కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారట మేకర్స్.