అవును ఆ తండ్రి చెప్తోంది అబద్దం, కొడుకు మాత్రం నిజం చెప్తున్నారు. వీళ్ళు మామూలు తండ్రి కొడుకులు కాదు – మెగా వారు. ఈ సంగతి మేము అనడం లేదు. సాక్షాత్తు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి వంశీకులే తొలివెలుగుతో చెప్పారు. చిరంజీవి చెప్తోంది అబద్దం, రామ్ చరణ్ చెప్తోంది నిజం. ఇదంతా అన్నది సైరా కథ కోసం ఉయ్యాలవాడ వంశీకులకు ఇస్తానన్న రెమ్యూనరేషన్ గురించి.
సైరా సినిమా మీద రోజురోజుకి అంచనాలు ఎలా పెరుగుతున్నాయో, అలానే ఆ సినిమా చుట్టూ కాంట్రోవర్సిలు కూడా ఎక్కువ అవుతున్నాయి! కొన్ని రోజులుగా ఉయ్యాలవాడ వంశీకులకు, మెగా కుటుంబానికి చాలా గొడవలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. మొదట్లో సైరా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఉయ్యాలవాడ కుటుంబసభ్యులను పిలిచి, మాట్లాడి… కుటుంబానికి పదిహేను లక్షల రూపాయల ఆర్ధికసహాయం అందిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఏమి జరిగిందో తెలియదు, అకస్మాత్తుగా మేము ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వందేళ్లు గడిచాక అది చరిత్ర కాబట్టి ఆ చరిత్ర మీద హక్కులు ఎవరివి కావు అంటూ రామ్ చరణ్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వెంటనే అన్యాయం జరిగింది, మా మీద అక్రమ కేసులను బనాయించి హింసపెడుతున్నారు అంటూ ఉయ్యాలవాడ వంశానికి చెందిన దస్తగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టారు. హైకోర్ట్ లో సినిమా సెన్సార్ ని అడ్డుకుంటూ స్టే కూడా సంపాదించారు. అయితే ఈ రోజు ఆ కుటుంభీకులు…మేము అన్ని కేసులు విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము …కానీ ఒక్క విషయం చెప్పాలని అనుకుంటున్నాము…రామ్ చరణ్ కుటుంబానికి 15 లక్షల రూపాయిలు ఇస్తానని చెప్పడం వాస్తవం. కానీ చిరంజీవిని అన్నట్టు కుటుంబానికి రెండు కోట్ల రూపాయిలు అడిగామన్నది పచ్చి అబద్దం అన్నారు.
హైకోర్ట్ లో ఇంకా ఈ కేసు నడుస్తోంది. రేపు తీర్పు వెల్లడించనున్నారు. ఇంకో 48 గంటల్లో సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఫాన్స్ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు.