సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సిటీమార్. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆంధ్ర మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్… తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్, సాంగ్స్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇప్పుడు ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. రేపు ఉదయం 10 గంటలకు మెగా అప్డేట్ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ రాబోతున్నాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.