మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు స్పెషల్ విషెస్ తెలిపారు. మొత్తం కెరీర్ లో మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సీసీటీ)లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.
నాకు మొదటి పెద్ద సపోర్ట్ మా అమ్మ, ఆ తర్వాత సురేఖ. నా సోదరీమణులు, నా పిల్లలు. నేను నా పనిపై దృష్టి పెట్టాను. కానీ నా కుటుంబం గురించి ఎప్పుడూ చింతించలేదు. ఎందుకంటే సురేఖ ఉంది. ఇప్పుడు నేను మెగాస్టార్ అయ్యాను… ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.
ఆ తరువాత చమత్కారంగా నేను ఇప్పుడు చెప్తున్న మాటలకు సురేఖ రియాక్షన్ ఏంటో ఇంట్లో తెలుస్తుందని అన్నారు. అయినప్పటికీ, నేను ఆమె విషయంలో గర్వపడుతున్నానని అన్నారు.
ఇక కోకాపేటలో చాలా కాలం క్రితం గిట్టుబాటు ధరకు ఎకరం భూమి కొన్నానని, ఇప్పుడు దాని విలువ ఊహించనంతగా పెరిగిపోయిందని వెల్లడించారు. గత సంవత్సరం నా పుట్టినరోజు, రక్షా బంధన్ ఒకే రోజు కావడంతో నేను మా సోదరీమణులకు ఆ భూమిని బహుమతిగా ఇచ్చాను. భూమిని ఇవ్వాలనేది సురేఖ యొక్క ఆలోచనని అన్నారు.