సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అనంతరం ఎలాంటి ప్రకటన రాబోతుంది? టికెట్ ధరల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ? అనేది అందరి లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే అందుకు తగ్గట్టుగానే మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.
శ్రీ వై ఎస్ జగన్ గారి పిలుపు ఎంతో భాద్యతగా అనిపించిందని….ఇండస్ట్రీకి సంబంధించి రెండు వైపుల సమస్యలు కూడా వినాలన్నారు. అలాగే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాన్నే తీసుకుంటానని చెప్పారని అన్నారు.
ఈ వారం పది రోజుల్లో కొత్త జిఓ కూడా రావచ్చని అలాగే ఏపీలో 5వ ఆట పర్మిషన్ పై కూడా పునరాలోచన చేస్తామని జగన్ చెప్పినట్లు చెప్పుకొచ్చారు.