దర్శకుడు కోదండ రామిరెడ్డి తర్వాత కె.రాఘవేంద్రరావు చిరుల కాంబినేషన్లో సినిమా అంటే ఒకప్పుడు యమాక్రేజ్. చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. 1976లో క్రాంతికుమార్ నిర్మాణ సారథ్యంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో జ్యోతి అనే సినిమా రూపొందడం జరిగింది.
అయితే ఆ నిర్మాతే చిరంజీవితో ప్రాణం ఖరీదు చిత్రాన్ని రూపొందించారు. ప్రాణం ఖరీదు చిత్ర దర్శకుడు కె.వాసును ప్రాణం ఖరీదు లో యాక్ట్ చేస్తున్న కొత్త కుర్రాడు ఎలా ఉన్నాడని రాఘవేందర్ రావు అడిగారు.
చిరంజీవి సాంగ్స్ పెట్టుకొని నైట్ విపరీతంగా డాన్స్ చేస్తున్నాడు..నాకు రాత్రిళ్లు నిద్ర ఉండటం లేదని కె.వాసు రాఘవేంద్రరావుకు చెప్పారు.ఆ తర్వాత నిర్మాత క్రాంతికుమార్ ఆఫీసుకు వచ్చిన కె.రాఘవేంద్రరావు అక్కడే ఉన్న చిరంజీవిని చూడడం జరిగింది.
చిరంజీవి తీక్షణమైన కళ్ళను చూసి ఎలాగైనా తాను తీయబోయే సినిమాలో చిరంజీవికి ఒక పాత్ర ఇవ్వాలని కె. రాఘవేంద్రరావు నిర్ణయించుకోవడం జరిగింది. అలా క్రాంతి కుమారు నిర్మాతగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మోసగాడు చిత్రంలో శోభన్ బాబు, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు.
ఇందులో రాఘవేంద్రరావు చిరంజీవికి అవకాశం ఇవ్వడం జరిగింది. 1980లో లో చిరంజీవి రాఘవేంద్రరావు ప్రయాణం మొదలైంది ఆ తర్వాత ఎన్టీఆర్ చిరంజీవి కలయికలో తిరుగులేని మనిషి, ఆ తరువాత చిరంజీవిని సోలో హీరోగా పెట్టి కొండవీటి రాజా అనే సూపర్ డూపర్ హిట్ సినిమాలని రాఘవేంద్రరావు తీయడం జరిగింది.
ఆ తర్వాత అడవి దొంగ, చాణక్య శపధం, యుద్ధభూమి, మంచి దొంగ వీటితో పాటుగా తెలుగు సినీ పరిశ్రమ మర్చిపోలేని సోషియో ఫాంటసీ కథాంశంతో చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే ఇండస్ట్రీ హిట్ సినిమా రాఘవేంద్ర రావు అందించారు.
ఆ తరువాత రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు, శ్రీ మంజునాథ లాంటి చిత్రాలను రాఘవేంద్రరావు చిరంజీవితో రూపొందించడం జరిగింది.
1994 అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో చిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపిస్తారు.
ఈ త్రిపాత్రాభినయం లో ఏదో ఒక పాత్రను చిరంజీవి పోషిస్తూ మిగిలిన రెండు పాత్రలను డూప్ గా పెట్టడం జరిగింది.ఇద్దరు డూపుల్లో ఒకరు తన స్నేహితుడు నటుడు ప్రసాద్ బాబు కాగా, రెండవ డూపుగా చిరంజీవి పర్సనల్ పి.ఏ సుబ్బారావు నటించారు.
ఈ చిత్రంలోని త్రిపాత్రాభినయంలో పృద్వి పాత్రకు చాలా వెయిట్ ఉంటుంది. ఈ చిత్రంలో చిరంజీవి మూడు పాత్రలకు విభిన్నమైన వాయిస్ డబ్బింగ్ చెప్పడం ఓ విశేషం.
Also Read: వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ విలన్లు… తర్వాత కితకితలు పెట్టే కమెడియన్లు…!