మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా తన నటన అందర్నీ ఆకట్టుకుంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఆ పాత్రని చరణ్ కనబరిచిన తీరు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి సినీ టెక్నీషియన్ పొగిడేలా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ నెంబర్ వన్ డైరెక్టర్, అవతార్ తెరకెక్కించిన జేమ్స్ కామెరాన్.. ఆర్ఆర్ఆర్ చూసిన తరువాత, ప్రత్యేకంగా రాజమౌళికి వీడియో కాల్ చేసి మరి తన అనుభవాన్ని తెలియజేశాడు. ఆ క్రమంలోనే సినిమాలోని రామ్ చరణ్ పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
“రామ్ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్రలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా దీనిని గురించి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావిస్తూ ఒక ఎమోషనల్ ట్వీట్ వేశాడు. “సార్ జేమ్స్ కామెరాన్ మీలాంటి గ్లోబల్ ఐకాన్ అండ్ సినిమాటిక్ జీనియస్ నుండి ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్ చరణ్ పాత్రకు ప్రశంసలు అందడం.. ఆస్కార్ అందుకోవడం కంటే ఎక్కువ. మీ అభినందన అతని భవిష్యత్ ప్రయత్నాలకు ఒక ఆశీర్వాదం. రామ్ చరణ్ కి ఇది ఒక గొప్ప గౌరవం. ఒక తండ్రిగా చరణ్ ఇంత దూరం వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను” అంటూ చిరు ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా చరణ్ ప్రెజెంట్ RC15 లో నటిస్తున్నాడు. ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సోషల్ ఎలిమెంట్ తో వస్తున్న ఈ మూవీలో చరణ్ డిఫరెంట్ రోల్స్ లో కనబడబోతున్నాడట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ విశాఖపట్నంలో మొదలయింది.
వచ్చే నెలలో చరణ్ బర్త్ డే ఉండడంతో.. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు.
Sir @JimCameron an acknowledgement of his character in #RRR from a Global Icon & Cinematic Genius like you is no less than an Oscar itself! It’s a great honor for @AlwaysRamCharan As a father I feel proud of how far he’s come. Ur compliment is a blessing for his future endeavours pic.twitter.com/jof3Q9j0pA
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2023