టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో కొన్ని సినిమాలు ఆయనకు షాక్ ఇచ్చాయి. ఒక్కో సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దర్శకులు చేసిన తప్పులతో సినిమాలు ఎన్టీఆర్ కు ఘోరంగా షాక్ ఇచ్చాయి. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి వరుస హిట్ లతో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో చాలా స్పీడ్ గా వెళ్ళాడు. ఆ తర్వాత నిర్మాతలు, దర్శకులు మంచి కథలు తెచ్చినా సరే ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాడు.
Also Read:ఇజ్రాయెల్ లో కొత్త వేరియంట్.. శాస్త్రవేత్తల ఆందోళన
అయితే ఆంధ్రావాలా సినిమా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను బాగా ఇబ్బంది పెట్టింది. సింహాద్రి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఫాలోయింగ్ పెరిగింది. మాస్ లో ఎన్టీఆర్ కు ఇమేజ్ పెరగడంతో దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా సినిమా మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది. ఈ సినిమా తొలి రోజు తొలి ఆట తోనే ఫ్లాప్ గా నిలిచింది. సినిమాను కొన్న వాళ్ళు చాలా భయపడిన సరే నష్టాలు మాత్రం రాలేదు. ఎన్టీఆర్ క్రేజ్ వాళ్ళను కాపాడింది.
ఈ సినిమా ఏకంగా 55 కేంద్రాల్లో 175 రోజుల పాటు ఆడింది. దీనితో ఆంధ్రావాలా సినిమాపై కూడా భారీ అంచనాలు వచ్చాయి. సింహాద్రి సినిమా చాలా బాగా ఆడటం తో ఆ ప్రభావం ఆంధ్రావాలా మీద పడటం తో నష్టాలు రాలేదు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులో ఆడియో ఫంక్షన్ పెడితే 20 లక్షల మంది రావడం అప్పట్లో బాగా హైలెట్ అయింది. అయితే ఈ సినిమా కథను ముందు చిరంజీవికి పూరి జగన్నాథ్ చెప్పగా చిరంజీవి వద్దన్నారు. అటు ఇటు తిరిగి జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చింది. 2004 జనవరి ఒకటిన ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, పూరి చాలా జాగ్రత్తపడి సినిమాలు చేసే పరిస్థితి వచ్చింది.
Also Read:పార్టీ ఉండాలంటే.. వాళ్లు పోవాలి: గాంధీలకు సూచన