మెగాస్టార్ చిరంజీవి… ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారారు. తక్కువ టైంలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. 150కి పైగా చిత్రాలలో నటించి టాలీవుడ్ లో మకుటంలేని హీరోగా నిలదొక్కుకున్నారు. అయితే చిరంజీవి గురించి చాలా మందికి చాలా విషయాలు తెలీదు. ముఖ్యంగా ఆయన వివాహం వెనుక పెద్ద కథనే ఉంది.
ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. నిజానికి పెళ్లికాకముందు హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్నారు. ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పాక అప్పటి నిర్మాత దర్శకుడు ధవళ సత్యం కు కూడా అల్లు రామలింగయ్య చెప్పాడట. ఈ కుర్రాడికి మా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నా సత్యం అని చెప్పగా వెంటనే అసత్యం చిరంజీవి మంచి స్టార్ హీరో అవుతారని…అణుకువ కలిగిన వ్యక్తి అని వివాహం చేయొచ్చని అన్నారట.
దేవి నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ…జబర్దస్త్ లో స్కిట్
అయితే ఈ విషయం చెప్పేందుకు చిరు తండ్రి దగ్గరకి ఈ ఇద్దరూ వెళ్లగా ఆయన మొదట నో చెప్పారట. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కనుక మన ఇంట్లో ఉంటుందా అనే డౌట్ చిరంజీవి తండ్రికి వచ్చిందట.
యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?
కానీ అల్లు రామలింగయ్య సత్యం ఇద్దరూ కలిసి చిరు తండ్రిని ఒప్పించారట. ఈ విధంగా చిరంజీవి, సురేఖ ల పెళ్లి జరిగింది. ఇదే కాదు… చిరు పెళ్లి సమయంలో ఎన్నో విషయాలు కూడా జరిగాయట. పెళ్లి రోజు షూటింగ్, చిరిగిన బట్టలతో తాళి కట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయట.