సాధారణంగా సినిమాల్లో నటించే వారికి కాస్త ఇగోలు ఉంటాయి అనే మాట వింటూ ఉంటాం. కాని కొందరు మాత్రం ఇగోలకు పోయే అవకాశం ఉండదు అంటూ ఉంటారు. ఈ తరం హీరోలు ఏమో గాని గతంలో అయితే అలాంటివి ఉండేవి కాదు. ఈ విషయంలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. మెగా హీరోలు అందరికి కథల విషయంలో సలహాలు ఇస్తూ ఉంటారు. ఏ విధంగా నటించాలో కూడా చెప్తూ ఉంటారు.
Also Read:దేశం కోసం బీఆర్ఎస్.. ఖమ్మం సభలో నినదించిన కేసీఆర్!
రామ్ చరణ్ విషయంలో ఏ కేర్ తీసుకుంటారో వేరే హీరోల విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో అంతమంది హీరోలు ఉన్నా సరే ఆయనకు మాత్రం ఫేవరేట్ అనే వారు ఎవరు లేరట. ఒక హీరోని మాత్రం ప్రత్యేకంగా అభిమానిస్తారట చిరంజీవి. ఈ హీరో ఎవరు ఏంటీ అనేది ఒకసారి చూద్దామా…?
ఆ హీరో జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన ముందు నుంచి అభిమానిస్తారట. అల్లు అర్జున్ కంటే ముందు జూనియర్ సినిమాల్లోకి వచ్చాడు. డాన్స్ విషయంలో ఎన్టీఆర్ ను చిరంజీవి ఎక్కువగా అభిమానిస్తారట. కచ్చితంగా ఎన్టీఆర్ సినిమా చూడటమే కాకుండా ఫోన్ చేసి అభినందిస్తారు చిరంజీవి. డాన్స్ లో గ్రేస్ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ ను పొగిడిన సందర్భాలు ఉన్నాయట.
Also Read:‘పొరబాటున తేజస్వి డోర్ తెరిచారు’ .. జ్యోతిరాదిత్య సింధియా