కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి హీరోలకు మంచి కోరికలు ఉంటాయి. ముఖ్యంగా ఇతర భాషాల్లో వచ్చిన సినిమాలను ఇక్కడ రీమేక్ చేసే ముందు ఆలోచిస్తూ ఉంటారు. మంచి సినిమా అయితే తమకు రావాలి అనుకుంటారు. ఇలా అనుకున్నా సరే కొన్ని సార్లు జారిపోతూ ఉంటాయి. కాని చిరంజీవి పుణ్యమా అని హీరో రాజశేఖర్ కు తన కోరిక నెరవేరింది. అసలు ఆ సినిమా ఏంటీ… దాని కథ ఏంటీ అనేది చూద్దాం.
రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన న్యాయం కోసం సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. మలయాళం లో ఒరు సీబీఐ డైరీ కురిప్పు అనే టైటిల్ తో ఈ సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఇందులో హీరో సిబిఐ ఆఫీసర్ గా చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ సినిమాను రాజశేఖర్ చేయాలి అనుకోవడం జరిగింది. కాని చిరంజీవి చేస్తున్నారని తెలియడంతో ఆయన కాస్త బాధ పడ్డారట. ఆ కథ విని ఎవరైనా నిర్మాత కొంటే తాను యాక్ట్ చేయాలని చూసారు.
అప్పటికే అల్లు అరవింద్ ఆ కథ కొనడం చిరంజీవిని ఫైనల్ చేయడం జరిగాయి. కాని ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక సినిమా కార్యక్రమంలో రాజశేఖర్, అల్లు అరవింద్ ఎదురు పడి మాట్లాడుకుంటూ… అల్లు అరవింద్… రాజశేఖర్ ను అడిగారట. న్యాయం కోసం సినిమా చేస్తావా… మీ పేరు చిరంజీవి రికమండ్ చేసారు అని. వెంటనే మరో ఆలోచన లేకుండా రాజశేఖర్ ఆ కథ ఓకే చేసారట.