సైరా నర్సింహా రెడ్డి సినిమాతో మంచి జోష్ మీద ఉన్న చిరంజీవి నెక్స్ట్ సినిమాకు తెగ కష్టపడుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్ చేయనున్నాడని సమాచారం. అయితే చిరు యంగ్ లుక్ లో కనిపించటానికి ఆల్రెడీ వర్క్అవుట్స్ స్టార్ట్ చేశాడు.
సాధారణంగా కొరటాల శివ తన సినిమాలో హీరో లుక్ ని మార్చేస్తుంటాడు. దానికి ఉదాహరణ మిర్చి సినిమాలో ప్రభాస్ ను పూర్తిగా న్యూ లుక్ లో చూపించాడు. ఎన్టీఆర్, మహేష్ ఇలా కొరటాల తీసిన సినిమాల్లో తన మార్కు చూపించాడు. ఇప్పుడు తాజాగా చిరంజీవి 152 వా సినిమాలో చిరు లుక్ ని మార్చేయాలని డిసైడ్ అయ్యాడట.
చిరు జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అది చుసిన నెటిజన్లు కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరికొందరు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.