టాలీవుడ్‌లో మెగాస్టార్ చరిష్మా గురించి చెప్పనవసరం లేదు. ఆయన సినిమా అంటే బాక్సాఫీసు రికార్డులు బద్దలు కావాల్సిందే. రీ ఎంట్రీలో ఆయన చేసిన సినిమాలే రెండే అయినా.. చిరంజీవికి గతంలో కంటే క్రేజ్ మరింత ఎక్కువైంది. దీంతో ఆయనతో సినిమా తీసేందుకు నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇప్పటికే ఆచార్య చిత్రానికి చిరంజీవి రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుండగా.. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా కోసం మెగా పేమెంట్ తీసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
వేదాలమ్ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా కోసం చిరంజీవి రూ.60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్ కంటే చిరుకు ఇచ్చే రెమ్యూనరేషన్ ఎక్కువ అని టాక్. మెగాస్టార్ సినిమా అంటే కాసుల వర్షం ఖాయమన్న ధైర్యంతో అనిల్ సుంకర ఈ డేరింగ్ స్టెప్ వేస్తున్నారట. వేదాలమ్ రీమేక్‌కు మెహర్ రమేశ్ డైరెక్టర్‌గా ఫిక్స్ చేశారు.