బాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ చిత్రం అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతుంది. అమీర్ చేసే ప్రతి సినిమా కూడా ఎంతో కొత్తదనాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువగా స్ఫూర్తి నింపే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ఇప్పుడు తెరకెక్కుతున్న చిత్రం లాల్ సింగ్ చడ్డా కూడా అలాంటిదే.
అయితే ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కూడా నటిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమాలో నాగచైతన్య… బాలరాజు అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగచైతన్యకు సంబంధించిన పాత్ర పేరును మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు.
అంతేకాకుండా… ఆలనాటి బాలరాజు (ఏఎన్నాఆర్) అక్కినేని నాగచైతన్యే ఈ బాలరాజు అంటూ చిరు ట్విట్ చేశారు. దీనిపై నాగచైతన్య స్పందిస్తూ… ఈ పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. తన బాలా అమీర్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు వెల్లడించారు.
అంతేకాకుండా, విశేష రీతిలో మద్దతు తెలుపుతున్న మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు చై.
ఈ చిత్రాన్ని తెలుగులో చిరు సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెగాస్టార్ ఇంట్లో లాల్ సింగ్ చడ్డా ప్రివ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అమీర్ ఖాన్ సమక్షంలో ఈ సినిమా ప్రివ్యూ నిర్వహించారు.