మెగాస్టార్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక,చిరు సోషల్ మీడియా ఎంట్రీతో ఆయన ఖాతాకు అభిమానుల తాకిడి పెరుగుతోంది. ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది. బుధవారం తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన చిరు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దాంతోపాటు ఆయన కరోనా విషయంలో అలర్ట్ గా ఉండాలంటూ…ప్రభుత్వ సూచనలు పాటించి ఇళ్లకే పరిమితం అవ్వండి అంటూ పిలుపునిచ్చారు.
ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన చిరు ఓ విషయంలో మాత్రం షాక్ ఇచ్చారు. తన ఖాతాలో యాక్టర్, ఇండియన్ మాత్రమే పేర్కొన్నాడు. దీంతో ఇక ఆయన పాలిటిక్స్ కు దూరమైనట్టేనని …ఇందుకు తన ట్విట్టర్ ద్వారా పరోక్ష సమాధానం చెప్పారని అంటున్నారు. చిరు అందులో పొలిటీషియన్ అని మాత్రం పేర్కొనలేసు. ఇటీవల ఆయన జగన్ తో సఖ్యతగా ఉండటంతో చిరు మరికొన్ని రోజుల్లోనే రాజకీయాల్లో మళ్లీ కనిపిస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా ట్విట్టర్ అకౌంట్ తో వాటన్నింటినీ కొట్టివేస్తూ..తాను సినిమాలకే పరిమితం అవ్వాలనే నిర్ణయాన్ని పరోక్షంగా బయటపెట్టాడు మెగాస్టార్.ఇక ఆయనను పూర్తి స్థాయిలో నటుడిగానే చూడనున్నాం…