మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ చాలా జోరుగా సాగిపోతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 150వ సినిమాగా తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఖైదీ నెంబర్ 150 వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఘన విజయం సాధించిన తరువాత 151 వ సినిమాగా మళ్లీ రామ్ చరణ్ నిర్మాతగా అదే బ్యానర్‌పై సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఆ తరువాత చేయబోయే 153వ సినిమా కూడా అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. అది సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ చేయబోతున్న సినిమా. ముందుగా ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అని అన్నారు. అయితే చిరంజీవి స్వయంగా తాను ఇందులో డబుల్ రోల్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. మరోవైపు ఈ సినిమా రైతుల సమస్యలపై ఒక సందేశాత్మక చిత్రం అని మీడియాలో న్యూస్ వచ్చింది. కానీ చిరంజీవి సూచనల మేరకు ఈ చిత్ర కథను కొరటాల మార్చాడని ఇప్పుడు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో వరుసగా రైతుల సమస్యలపై “మహర్షి” లాంటి సినిమాలు రావడం, విజయవంతం కావడం జరిగింది కాబట్టి మళ్లీ అదే సమస్య అయితే జనాలకు ఒకింత బోర్ కొట్టే అవకాశం ఉందని, అందుకే మరేదైనా డిఫరెంట్ అంశాన్ని ఎంచుకోమని చిరు సూచించాడట. దానికి తగ్గట్టే కొరటాల కథలో మార్పులు, చేర్పులు చేసుకొని చిరంజీవికి చెప్పడం. ఆయన ఓకే చేయడం జరిగింది అంటున్నారు సినీ వర్గాలు. ఏదేమైనా చిరంజీవి 153వ సినిమా కూడా తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది అని నమ్మకంగా చెబుతున్నారు కొరటాల శివ.