ఈ కాలం ఓ సినిమాను డిసైడ్ చేయడానికి ఫస్ట్ వీకెండ్ చాలు. మొదటి 3 రోజులు గడిస్తే సినిమా రిజస్ట్ తేలిపోతుంది. అయితే రెవెన్యూ పరంగా ఓ సినిమాను డిసైడ్ చేయాలంటే ఫస్టీ వీక్ వరకు ఆగాల్సిందే.
రిలీజ్ తర్వాత మొదటి వారం రోజులు వచ్చిన వసూళ్లు మాత్రమే సినిమాకు కొలమానం. ఆ వారం రోజుల్లో ఎంత కలెక్ట్ చేశామనే అంశంపైనే హీరో స్టామినా ఆధారపడి ఉంటుంది. అలా చిరంజీవి తన పవర్ ను నిలబెట్టుకున్నారు. వాల్తేరు వీరయ్యతో ఆయన మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
వాల్తేరు వీరయ్య సినిమాకు మొదటి వారం వరల్డ్ వైడ్ గా 96 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అయితే ఇది ఆయన తాజా చిత్రాల్లో కెరీర్ బెస్ట్ మాత్రం కాదు. రీఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన 5 సినిమాల్లో సైరాదే రికార్డ్. ఆ లెక్కలు (షేర్) ఓసారి చూద్దాం.
వాల్తేరు వీరయ్య – 96.46 కోట్లు
గాడ్ ఫాదర్ – 53.10 కోట్లు
ఆచార్య – 47.87 కోట్లు
సైరా – 115.38 కోట్లు
ఖైదీ 150 – 77.32 కోట్లు