మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత వేదాళం, లూసిఫర్ రీమేక్ లో మెగాస్టార్ నటించబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందులో మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడు. కాగా బుధవారం ఉదయం ఫిలింనగర్ లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్వినీ దత్, నాగబాబు,కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూవీ క్రియేషన్స్ విక్కీ తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టుగా మోహన్ రాజా సిద్ధం చేశారని నిర్మాతలు తెలిపారు. మెగాస్టార్ కెరీర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుందని ఆయన అన్నారు. సూపర్ గుడ్ ఫిలింస్ ఎన్. వి.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి ఎన్ వి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.