మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సంబరాలు ఒకరోజు ముందే మొదలయ్యాయి. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లూసీఫర్ రీమేక్ మూవీకి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించి చిరు ప్రీ లుక్ తో పాటు టైటిల్ తో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.
చేతిలో గన్.. తలపై టోపీతో చిరు లుక్ అదిరిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాను రిలీజ్ కు రెడీ చేశారు చిరు. తర్వాత గాడ్ ఫాదర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. అనంతరం బాబీ, మెహర్ రమేష్ సినిమాలు పట్టాలెక్కుతాయి.