విజయవాడ కోవిద్ కేర్ సెంటర్ లో జరిగిన ప్రమాదంలో 13 మంది మృతి చెందగా మరి కొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా రాజకీయ సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఘటనపై ట్వీట్ చేశాడు.విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేస్తూ,బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.ఇలాంటి నిర్లక్ష వైఖరిని తీవ్రంగా పరిగణిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినబాధ్యత ప్రభుత్వానిదేనంటూ ట్వీట్ లో చిరంజీవి పేర్కొన్నారు.
విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేస్తూ,బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.ఇలాంటి నిర్లక్ష వైఖరిని తీవ్రంగా పరిగణిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినబాధ్యత ప్రభుత్వానిది
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2020