ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చారు చిరంజీవి. సీఎం జగన్ సతీసమేతంగా చిరంజీవి దంపతులకు స్వాగతం పలకగా… చిరు జగన్‌ను సత్కారించారు. అయితే,ఈ భేటీ కేవలం సైరా వరకే పరిమితమవుతుందా లేక ఇతర రాజకీయాలేమయినా చర్చకు వచ్చాయా అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒ వైపు జనసేనాని, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌పై అనేక ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో… చిరు-జగన్ భేటీ ఇటు రాజకీయ వర్గాలను కూడా ఆలోచనలో పడేసింది.