కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు 152వ చిత్రంగా రాబోతున్న ఈ సోషల్ డ్రామా సినిమా… కోకాపేట పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఆగస్ట్ 14న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని మరీ సినిమాను ప్లాన్ చేశారు.
సినిమా టైటిల్‌పై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోయినా… ఆచార్య, గోవింద్ ఆచార్య అనే రెండు టైటిల్స్‌పై మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా ఆచార్య టైటిల్‌ను ఖరారు చేయటంతో పాటు ఫిలిం చాంబర్‌లో నమోదు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటనకు ఇంకాస్త సమయం పట్టనున్నట్ల సమాచారం.