సైరా నర్సింహారెడ్డితో రెబల్‌గా మారిన మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత చిత్రం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే… ఓ చిన్న లీక్ చిరు నెక్ట్స్ సినిమా గురించి చెప్పకనే చెప్పేసింది. అవును… చిరు నటిస్తోన్న 152వ చిత్రంలో నక్సలైట్‌గా కనిపించబోతున్నారు చిరంజీవి.
హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో చాలా రోజులుగా సినిమా షూటింగ్ నడుస్తోంది. దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు ఎలాంటి లీకులు లేకుండా ఇన్నాళ్లు జాగ్రత్తపడ్డప్పటికీ… తాజాగా ఓ ఫోటో లీకయింది. ఇప్పుడా ఫోటో వైరల్‌గా మారింది.
తెలుగు సినిమాకు పెద్ద దిక్కుగా ఉండే దాసరి సినిమాలు చేస్తున్న సమయంలో నక్సలైట్ పాత్ర గెటప్‌ను అదేవిధంగా చిరు దించేసినట్లు స్పష్టంగా కనపడుతోంది. ఈ లీకయిన ఫోటోకు ముగ్గురు మొనగాళ్లలో చిరంజీవి కనపడినట్లు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, ఫోటోలు-వీడియోలు లీకయ్యాయని తెలియగానే నిర్మాత రాంచరణ్ రంగంలోకి దిగిపోయారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ నుండి వీడియోలను తీసేయించారు. కానీ ఫోటోలను మాత్రం ఆపటం ఎవరి వల్ల కాలేదు. అప్పటికే ఫోటోలన్నీ ఫాన్స్ మొబైల్స్‌కు చేరిపోవటంతో… వాట్సప్ గ్రూపుల్లో చిరంజీవి లెటెస్ట్ వర్కింగ్ స్టిల్ చెక్కర్లు కొడుతుంది.