దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునేంత వరకూ ఎవరూ నమ్మలేదు సందీప్ రెడ్డి వంగాను. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించగానే.. స్టార్ హీరోలు సైతం అతని వెంట పడ్డారు. కాని ఎక్కడా తొందరపడుకుండా.. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు సందీప్. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి తరువాత బాలీవుడ్ లో అడుగు పెట్టిన దర్శకుడు. ఇదే స్టోరీతో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టాడు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి చేతిలో ఇద్దరు పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లిపోయింది. ఈసినిమా చేస్తూనే.. అల్లు అర్జున్ తో మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు సందీప్ . రీసెంట్ గా ఈమూవీ అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. ఒక్కొక్కటిగా సినిమాలు కంప్లీట్ చేస్తూ రావాలని ప్లాన్ చేస్తున్నాడు సందీప్ . ఈక్రమంలో ఆయన కన్ను మెగాస్టార్ చిరంజీవి పైన పడింది. ఎలాగైనా మెగా హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడు సందీప్.
చిరంజీవితో సినిమా సందీప్ డ్రీమ్. అయితే అది ఇప్పుడు పెద్ద విషయం కాదు. సందీప్ కథ చెపుతానంటే..చిరంజీవి కాదనడు. కథ అటూ ఇటుగా ఉన్నా… సందీప్ మీద నమ్మకంతో ఒకే చెప్పినా చెప్పవచ్చు. కాని తాను మాత్రం పక్కా ప్లానింగ్ తో ఉన్నాను అంటున్నాడు సందీప్ . మెగాస్టార్ మెచ్చేలా కథను తయారు చేసి చెపుతాను అంటున్నాడు. ఎలాగైనా సింగిల్ సిట్టింగ్ లో సినిమాను ఓకే చేసేయాలని ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి. అందుకే కాస్త టైమ్ తీసుకుని అయినా మెగామూవీ కన్ ఫార్మ్ చేసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్నాడు సందీప్ రెడ్డి. రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాను రిలీజ్ కు ముస్తాబు చేస్తున్నాడు సందీప్ రెడ్డి. ఆ సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్ మూవీని కంప్లీట్ చేయబోతున్నాడు సందీప్. ఈమధ్యలో బన్నీ పుష్ప2నుంచి రిలీవ్ అవ్వగానే.. సందీప్ ప్రాజెక్ట్ లో జాయిన్ కాబోతున్నాడు. దాంతో.. సందీప్ కూడా పాన్ఇండియా డైరెక్టర్ గా దుమ్ము రేపబోతున్నాడు. మరి ఈసినిమాలో ఏ సినిమా అయినా బెడిసికొడితే.. ఫలితం తలకిందులయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో సందీప్ జాగ్రత్తగా ఉంటాడా లేదు అనేది చూడాలి.