మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనవసరం లేదు. ఎన్నో ఏళ్లు వెండితెరపై మెగాస్టార్ గా వెలుగొందిన ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆ తరువాత రాజకీయాలను వదిలి ఖైదీ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఇటీవల చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జాతీయస్థాయి పార్టీ రాజ్యసభ సభ్యుడిగా సీటు ఇచేందుకు సిద్ధంగా ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయమై మెగాస్టార్ స్పందించారు. సమంతా హోస్ట్ గా వస్తున్న సామ్ జామ్ ప్రోగ్రాం లో ఈ విషయంపై చిరంజీవి మాట్లాడారు. గడచిన పదేళ్లలో నేను ఎంతో తెలుసుకున్నాను. తనకు రాజకీయాలు సెట్ అవ్వవు. రాజకీయాల్లో కన్నా మెగాస్టార్ గానే నేను సంతోషంగా ఉన్నానని రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన కూడా ఇకపై లేదని క్లారిటీ గా చెప్పారు.