కొరటాల డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. అయితే ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ గట్టిగానే పలికినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ సంస్థ 26 కొట్లు పెట్టి కొన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ఈమధ్యే పవన్, రానా చిత్రం 23 కోట్లకు అమ్ముడుపోగా.. తాజాగా మెగాస్టార్ మూవీ అంతకుమించి రేటు పలికి ప్రస్తుత సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది.
ఆచార్య సినిమాకు నిర్మాత రామ్ చరణ్. ఇందులో సిద్ద అనే పాత్ర కూడా పోషించాడు. చిరంజీవి సరసన కాజల్ నటించగా, రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే చేసింది.