మెగాస్టార్ చిరంజీవి తెలుగులో నమోదు చేసిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటి వరకు ఉన్న స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని ఎన్నో రికార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆయన చేసిన సినిమాలు ఇప్పటికి కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక ఆయన సినిమాల విషయంలో ఫ్యాన్స్ క్రేజ్ పెరిగింది కూడా రాఘవేంద్ర రావు సినిమాల తర్వాతనే అని చెప్పాలి.
Also Read:గౌతం రెడ్డి కి చివరి వీడ్కోలు
35 ఏళ్ళ పాటు తెలుగులో ఎదురులేని స్టార్ గా ఒకవెలుగు వెలిగారు చిరంజీవి. ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా. ఈ సినిమా సాధించిన ఎన్నో రికార్డులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను తెరకెక్కించారు. సోషియో ఫాంటసి కథాంశంతో ఈ సినిమా ముందుకు వచ్చింది. బాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న శ్రీదేవిని తీసుకొచ్చి భారీ పారితోషికం ఇచ్చి సినిమా చేయించారు.
ఈ సినిమా రిలీజ్ అయి మూడు దశాబ్దాలు దాటినా సరే ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ సినిమాను చూస్తూనే ఉంటారు. నెల రోజుల తర్వాత కూడా ఈ సినిమాకు టికెట్ లు దొరకలేదు. సినిమా రిలీజ్ తర్వాత వారం రోజుల పాటు భారీ వర్షాలు పడ్డాయి. దీనితో సినిమా చూడటానికి ఎవరూ రాలేదు. ఏడాది పాటు ఈ సినిమా ఆడింది అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముప్పై ఏళ్ళ క్రితమే ఈ సినిమాకు చిరంజీవికి ఇచ్చిన రెమ్యునరేషన్ 35 లక్షలు. శ్రీదేవికి 25 లక్షలు ఇచ్చారట.
Also Read:గూడ్స్ రైలుకు నిప్పంటించిన మావోయిస్టులు