ఒక యోధుని కథ ప్రపంచానికి చాటిచెప్పినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. సైరా సౌత్, నార్త్ సినిమా కాదని… ఓ భారతీయ సినిమా అని అభిప్రాయపడ్డారు. అంతా చిరంజీవి సైరా సినిమా ఒక ఎత్తు, మిగతా 150 సినిమాలు ఒక ఎత్తు అంటుంటే ఆనందంగా ఉందని, నా బిడ్డ ఈ సినిమా నిర్మించటం… సుస్మిత కూడా టెక్నికల్‌గా ఈ సినిమాకు సపోర్ట్ చేసి ఎంతో కష్టపడ్డారన్నారు. సురేందర్ రెడ్డి ఎంతో ఎత్తుకు వెళ్తాడని ప్రశంసించారు. అనుష్క అయితే… ఎటువంటి పారితోషికం లేకుండా… అమెరికా నుండి వచ్చి యాక్టింగ్ చేసిందని ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.
ఇక గురువు పాత్రలో నేను కాళ్లు మొక్కే వ్యక్తి కోసం అమితాబ్‌ని అడిగారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కానీ ఆయన ఒప్పుకుంటారా అనిపించినా… ఒక్క ఫోన్ కాల్‌తో ఒప్పుకున్నారన్నారు చిరంజీవి. సైరా సినిమాపై చిరంజీవి మాట్లాడుతూ… అమితాబ్ రుణం తీర్చుకోలేనిదన్నారు. సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా… ఇలా అంతా అద్భుతంగా నటించారని కొనియాడారు.