హైదరాబాద్: తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ (టీసీపీఈయూ) ఏర్పాటుచేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ రథ సారథుల రజతోత్సవ వేడుకను గచ్చిబౌలి ఇన్‌డోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. సూపర్‌స్టార్ కృష్ణ, రెబల్‌స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, కె. రాఘవేంద్రరావు, మహేష్ బాబు, జయసుధ, జయప్రద, సుహాసిని, సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, రకుల్, అనసూయ వంటి సెలబ్రిటీలెందరో ఈ వేడుకలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ పక్కపక్కన కూర్చుని ముచ్ఛటించుకోవడం అందరి దృష్టిలో పడింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు.