సినీ ఇండస్ట్రీ పెద్ద అనే పదవి నాకు వద్దు అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి పెద్దరికం హోదా నాకు ఇష్టం లేదని నేను పెద్దగా వ్యవహరించని చెప్పుకొచ్చారు. ఆ పదవి నాకస్సలు వద్దు.
కానీ, బాధ్యత గల ఒక కళామతల్లి బిడ్డగా ఉంటానన్నారు. . అందరి బాధ్యతా తీసుకుంటా. అందుబాటులో ఉంటా. అవసరం వచ్చినప్పుడు ముందు ఉంటానని… అనవసరమైన వాటికి మాత్రం ముందుకు రానని అన్నారు. పంచాయితీలు చేయను… కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా నిలబడతాను అని అన్నారు.