సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఎంత పోటీ నడిచిందో అందరం చూశాం. ఒకేసారి చిరంజీవి, బాలయ్య సినిమాలు రిలీజ్ అయ్యాయి. దీంతో తేదీలపై గందరగోళం నెలకొంది. ఈ మొత్తం వ్యవహారంపై చిరంజీవి స్పందించారు. సంక్రాంతి విడుదల తేదీ విషయంలో తను వెనక్కి తగ్గిన విషయాన్నిఅంగీకరించారు.
“మైత్రీ సంస్థ నుండి రెండు సినిమాలు అనేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. పండగ ఎన్ని సినిమాలైన తీసుకుంటుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తే గనుక ఏ సినిమా రెవెన్యూ ఆ సినిమాకి ఉంటుంది. అందుకే నేనే వెనుకకు జరుగుతానని చెప్పాను. ఫస్ట్ డే రికార్డ్ కోసం తాపత్రయపడే వారైతే గనుక మా రెవెన్యు తగ్గిపోతుందనే ఫీలింగ్ ఉంటుంది. రావాల్సిన షేర్ వస్తుందనే నమ్మకం ఉంటే గనుక ఎప్పుడు ఎలా విడుదల చేసినా ఇది నిలబడి తీరుతుంది.”
ఇలా సంక్రాంతి బరిలో తనే తగ్గిన విషయాన్ని బయటపెట్టారు చిరంజీవి. తన సినిమాకు ఎంత ఓపెనింగ్ రావాలో అంత వస్తుందని, బెస్ట్ ఓపెనింగ్స్ పిచ్చి తనకు ఇప్పుడు లేదని రియాక్ట్ అయ్యారు చిరు.
తను ఓపెనింగ్స్ ను నమ్మనని, ఓవరాల్ గా ఏ సినిమా నిలబడుతుందో అదే సంక్రాంతి హిట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు చిరంజీవి. మరికొన్ని గంటల్లో వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లలోకి వస్తోంది.