దర్శకుడు కొరటాల శివ- మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో చిరు 152వ చిత్రం తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాకున్నా… సినిమా షూటింగ్ మాత్రం షరవేగంగా సాగుతోంది. సోషల్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని చిరంజీవి పట్టుదలతో ఉన్నారట.
అయితే, ఈ సినిమాలో ఓ కీ రోల్‌లో రాంచరణ్ నటించే అవకాశం ఉందని వార్తలొచ్చినా… RRR సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు రాంచరణ్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో చరణ్ ప్లేస్‌లో మహేష్ బాబు కానీ అల్లు అర్జున్ కానీ నటిస్తారని ప్రచారం సాగింది. అయితే… చిరు మాత్రం చరణ్ ఉండాల్సిందేనని పట్టుబడుతున్నాడట. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ చరణ్ సినిమాలో ఉండాల్సిందేనని చెప్పటంతో కొరటాల కూడా ఓకే అన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.