సైరా ప్రీరిలీజ్ వేడుక వాయిదా - chiranjeevi sye raa movie pre release function post poned- Tolivelugu

సైరా ప్రీరిలీజ్ వేడుక వాయిదా

సైరా వేడుక తేదీ ఎందుకు మారింది ? ముహూర్తం బాగా లేదా? తక్కువ సమయంలో ఫాన్స్ అంతా చేరుకోలేరనే డేట్ మార్చారా? ఏర్పాట్లు భారీగా చేయాల్సి ఉన్నందున ముహూర్తం మారిందా? ఈ ప్రశ్నలన్నీ ఫాన్స్‌లో ఆసక్తికరమైన చర్చను రేపుతున్నాయి. సెప్టెంబర్ 18న నిర్వహించాల్సిన వేడుకను 22కు వాయిదా వేయడంతో ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి.

chiranjeevi sye raa movie pre release function post poned, సైరా ప్రీరిలీజ్ వేడుక వాయిదా

 మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం సైరా నరసింహారెడ్డి.  తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సైరా ప్రీ రిలీజ్ వేడుకను సెప్టెంబర్ 18న నిర్వహిస్తున్నామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఐతే, ప్రస్తుతం వేడుకను సెప్టెంబర్ 22న నిర్వహించనున్నారని తెలుస్తోంది.

chiranjeevi sye raa movie pre release function post poned, సైరా ప్రీరిలీజ్ వేడుక వాయిదా

హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి, సక్సెస్‌పుల్ డైరెక్టర్ కొరటాల శివ, మాస్ డైరెక్టర్ వివి వినాయక్‌ అతిథులుగా రాబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఫాన్స్ సైరా ప్రీ రిలీజ్ వేడుకపై ఎంతో ఆసక్తి పెంచుకున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp