టాలీవుడ్ ఆల్ టైం హిట్స్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి ఒకటి. ఒక సామాన్య మానవుడి ప్రేమలో పడే దేవకన్యగా శ్రీదేవి అద్భుతం చేశారు. ఈ తరహా ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనే వచ్చాయి. అయితే దర్శకుడు రాఘవేంద్రరావు 90ల నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అప్పటి వరకు ఇండస్ట్రీ పేరున ఉన్న రికార్డ్స్ మొత్తం తుడిచిపెట్టిన ఈ చిత్రం… ఏడాది కాలం పాటు థియేటర్స్ లో ప్రదర్శించబడింది.
చిరంజీవి గ్రేస్, శ్రీదేవి గ్లామర్, రాఘవేంద్రరావు టేకింగ్ సినిమాను ఎవరెస్ట్ కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా శ్రీదేవిని వెండితెరపై చూసిన జనాలు… దేవకన్యలు నిజంగానే ఇలానే ఉంటారేమో అన్న భావన కలిగించారు. ఆ సినిమా తర్వాత శ్రీదేవి క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే అప్పటికే శ్రీదేవి సౌత్ ఇండియా సూపర్ స్టార్. బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేస్తున్నారు.
అప్పుడు శ్రీదేవికి ఉన్న క్రేజ్ రీత్యా రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉండేదట. టాలీవుడ్ టాప్ స్టార్ గా వెలిగిపోతున్న చిరంజీవి రెమ్యూనరేషన్ కి కొంచెం అటూ ఇటుగా శ్రీదేవికి చెల్లించారట. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్ర నిర్మాత అశ్వినీ దత్ ఆ సినిమాకు గాను శ్రీదేవికి చెల్లించిన రెమ్యూనరేషన్ వివరాలు వెల్లడించారు.
అప్పటికే చిరంజీవి టాలీవుడ్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ఉన్నారు. అలాంటి చిరంజీవికి సమానంగా శ్రీదేవికి చెల్లించారట. చిరంజీవి రూ. 35 లక్షలు తీసుకుంటే… శ్రీదేవికి రూ. 25 లక్షలు చెల్లించారట. ఇది ఓ రికార్డు అని చెప్పాలి.ప్రస్తుత టాలీవుడ్ టాప్ స్టార్స్ రూ. 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ దేశంలో ఏ హీరోయిన్ కూడా కనీసం 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. కాబట్టి నేటి లెక్కలతో పోల్చితే శ్రీదేవి భారీగా ఛార్జ్ చేసినట్లు అర్థమవుతుంది.
ఇక ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందని. అన్నీ కుదిరితే చేస్తామంటూ అశ్వినీదత్ తెలియజేశారు. ఇళయరాజా సంగీతం, రాజు సుందరం, ప్రభుదేవా కొరియోగ్రఫీ కూడా ఎంవీ విజయంలో కీలక పాత్ర వహించినట్లు తెలియజేశారు.ఇక ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించిన ప్రాజెక్ట్ కె… జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సీక్వెల్ అంటూ ప్రచారమైంది. ఈ రూమర్స్‌ను చిత్ర యూనిట్ కొట్టివేసింది. అయితే ఓ జనరేషన్ ఆడియన్స్, మెగా ఫ్యాన్స్ ఈ చిత్ర సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ లో నటించే అవకాశం కలదు.
1990 మే 9న విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి రూ .9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అప్పట్లో ఇది బాహుబలి బడ్జెట్ అనుకోవాలి. నెలల తరబడి థియేటర్స్ లో ప్రదర్శించబడిన జగదేకవీరుడు అతిలోకసుందరి రూ. 15 కోట్ల వసూళ్లు రాబట్టింది
Also Read: అందుకే పవన్ ఆయనను తమ్ముడు అన్నారా?