ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే స్టార్స్ గా నిలుస్తారు. అయితే అలా నిలిచిన వారిలో మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పక తప్పదు. నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ ఫెయిల్ అయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో మాత్రం రా రాజు గానే నిలిచాడు. పది సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చాడు.
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు. ఇదిలా ఉండగా 40 సంవత్సరాల కెరీర్ లో చిరంజీవి నటించిన 80% చిత్రాలు విజయం సాధించాయి. అంటే అతిశయోక్తి కాదు ఎంతో మంది హీరోయిన్లతో ఎంతో మంది దర్శకులతో టెక్నీషియన్స్తో పని చేశాడు చిరంజీవి.
ALSO READ : ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?
ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులతో కూడా నటించాడు. అక్కినేని నాగేశ్వరరావు తో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించి హిట్ అందుకున్నాడు. ఎన్టీఆర్ తో తిరుగులేని మనిషి సినిమా లో ఆయనకు బావమరిది గా నటించాడు.
ఇకపోతే రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొండవీటి సింహం సినిమా లో ఎన్టీఆర్ కి కొడుకు పాత్రకు ముందుగా చిరంజీవిని తీసుకున్నారు. ఎన్టీఆర్ ను విభేదిస్తూ ఆ సినిమా లో డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. 5 రోజులపాటు చిరంజీవిపై షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఎన్టీఆర్ పెద్ద హీరో చిరంజీవి మాత్రం కొత్తగా సినిమాల్లోకి అప్పుడే వచ్చాడు. దీంతో ఎన్టీఆర్ ను బెదిరిస్తూ డైలాగులు చెప్పేందుకు కాస్త తడబడ్డాడు చిరంజీవి.
Advertisements
ALSO READ : మగధీరను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయకుండా ఆపింది ఎవరో తెలుసా ?
కేవలం నెల రోజులు మాత్రమే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కాల్షీట్లు ఇవ్వడంతో చిరంజీవి ఈ పాత్ర లో సెట్ అవ్వటానికి టైం పడుతుందని భావించారట. దీంతో ఆయన స్థానంలో మోహన్ బాబు ని తీసుకున్నారు. మోహన్ బాబు మాత్రం తన పాత్రకు న్యాయం చేస్తూ పవర్ ఫుల్ డైలాగులు చెప్తూనే అద్భుతంగా నటించాడు.