కమల్ హాసన్ కే.విశ్వనాథ్, కాంబినేషన్లో వచ్చిన నటించిన సూపర్ హిట్ మూవి స్వాతిముత్యం. కమల్ హసన్ నటవిశ్వరూపాన్ని దేశవ్యాప్తంగా ఇనుమడింప చేసిన చిత్రమిది. మార్చి 27, 1985న విడుదల అయింది. ఇందులో కమల్ హాసన్ హీరోగా.. రాధిక హీరోయిన్ గా నటించారు.
పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన ఓ యువతి, అచ్చటా ముచ్చటా తీరకముందే భర్తచనిపోవడంతో ఆమె జీవితం తెగిన గాలిపటంలా మారిన తరుణంలో అనుకోకుండా ఒకవ్యక్తి ఆమె జీవితంలోకి భర్తగా వస్తాడు.
కడిగిన ముత్యంలాంటి అమాయకుడైన ఆ మనిషితో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరింగింది వంటి కథాకథనాలతో ఈ చిత్రం ఆబాలగోపాలాన్నీ అలరించింది.. చిత్రంలో కమల్ హాసన్ మంద బుద్ధిగల పాత్రలో చాలా అద్భుతంగా నటించారు.
Also Read: కిరణ్ అబ్బవరం కోసం అఖిల్
ఈ సినిమాతో కమల్ హాసన్ కి, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి, దర్శకుడు కే.విశ్వనాథ్ కి జాతీయ అవార్డులతో పాటు, నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. స్వాతిముత్యం సక్సెస్ సాధించిన తరువాత తమిళంలో కూడా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నారు కమల్.
అనంతరం ఈ చిత్రం కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేయబడింది. ఎంతో స్టార్ డం ఉన్న కమల్ హాసన్ ఈ సినిమాలో మందబుద్ధి కలిగిన పాత్రలో నటించడం అప్పట్లో పెద్ద సాహసమనే చెప్పాలి.మరోవైపు ఈ సినిమాలో మంద బుద్ది పాత్ర పోషించిన కమల్ హాసన్‌తో రాధికకి ఓ రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేసాడు దర్శకుడు.
వీరిద్దరి మధ్య రొమాన్స్ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఈ మాదిరిగానే చిరంజీవి కూడా ఆరాధన చిత్రం కోసం హీరోయిన్ సుహాసినితో రొమాన్స్ చేయాల్సి ఉండగా.. కమల్ హాసన్ ని కాపీ కొట్టబోయి విఫలం చెందారట.
ఒకరినీ కాపీ కొట్టడంలో ఎలాంటి ఉపయోగం ఉండదని.. మీలా మీరు నటించండి అంటూ దర్శకుడు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని చిరంజీవి విరమించుకున్నాడని తెలుస్తోంది. కమల్ హాసన్, చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన హీరోలో అనే విషయం అందరికీ తెలిసిందే.
Also Read: ఎన్టీఆర్ @30 ఇంట్రస్టింగ్ అప్ డేట్స్…!