సంక్రాంతి కానుకగా వచ్చిన మెగా మాస్ హిట్ వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి చేసిన ఈ మల్టీసారర్ మూవీకి బాబీ దర్శకత్వం వహించాడు. విడుదలై ఇన్ని రోజులవుతున్నా.. కొత్త సినిమాలు వస్తున్నా వాల్తేరు వీరయ్య హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబడుతోంది.
థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతుండగానే వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మాస్ ఎంటర్ టైనర్ ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్య డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ‘వాల్తేరు’ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మెగాస్టార్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ, ఇదే డేట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక ఓవర్సీస్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది వాల్తేరు వీరయ్య. ఇప్పటివరకు 2.25 మిలియన్ల కలెక్షన్లు రాబట్టింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషించాడు. సినిమా భారీ విజయం సాధించడానికి రవితేజ కూడా ఒక కారణమంటున్నాయి సినీ వర్గాలు.
మెగాస్టార్, మాస్ మహారాజా కాంబినేషన్ లో వచ్చిన సీన్లు థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. ఇక శ్రుతిహాసన్ అంద చందాలు, కేథరిన్ అభినయం సినిమాకు ప్రత్యేక స్పెషల్ అట్రాక్షన్. ఇక దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ ఛార్ట్ బస్టర్ గా నిలిచాయి.