తన మేనల్లునికి మెగాస్టార్ చిరంజీవి వార్నింగ్ ఇచ్చారు. మెగాస్టార్ ఇన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ బుధవారం అంటే ఉగాది నుండి ట్విట్టర్ ద్వారా అభిమానులకు, ప్రజలకు అందుబాటులో ఉంటాను అని ప్రకటించారు.
అయితే, చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీకి తన మేనల్లుడు ధరమ్ తేజ్ వెల్ కం మెగాస్టార్ అంటూ కామెంట్ చేశాడు. ఈ చర్చలో భాగంగానే ధరమ్ తేజ్ కు చిరు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
చిరంజీవి సినిమాల్లో హిట్ సాంగ్స్ ను సాయి ధరమ్ తేజ్ రీమేక్ చేసి తన సినిమాలో వాడుకోవటం అలవాటే. అయితే… ఇక నుండి అలా కాదు, నా సినిమాలో సాంగ్స్ రీమేక్ చేయాలంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాల్సిందేనంటూ ఆదేశించాడు.
అంటే ఇన్నాళ్లు చిరుకు తెలియకుండానే తన సినిమా పాటలను వాడుకున్నారా…? అన్న సందేహాం వస్తుంది.