మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశా చట్టం తీసుకురావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. దిశ చట్టం తీసుకురావాలనే నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ చట్టంతో మహిళలకు రక్షణకు ఉంటుందనే ఆశ తనకుందన్నారు చిరంజీవి.
దిశ ఘటన జరిగిన వెంటనే తక్షణ న్యాయం చేయాలని మనమందరం డిమాండ్ చేశామని గుర్తు చేసుకుంటూ తక్షణ న్యాయం కన్నా సత్వర విచారణ మంచి పాలితనిస్తుందన్నారు. అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందగుడు వెయ్యటం మంచి పరిణామమన్నారు చిరంజీవి. అంతే కాకుండా నాలుగు నెలలు పైగా జరిగే విచారణ సమయాన్ని 21 రోజులకు కుదించటం, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చెయ్యటం గర్వించదగ్గర విషయమన్నారు.
దీని ద్వారా సోషల్ మీడియాలో మహిళలపైన, బాలికలపై కామెంట్స్ చెయ్యటానికి, నేరాలు చెయ్యటానికి భయం కలుగుతుందన్నారు చిరంజీవి.