సినిమా టికెట్ల ధరల వ్యవహారమై ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి టాలీవుడ్ స్టార్స్ ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ, యంగ్ రెబల్ స్టాప్ ప్రభాస్ ప్రత్యేక ఫ్లైట్లో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. ప్రస్తుతం జగన్ తో భేటీ అయ్యారు.
అయితే ప్రత్యేక విమానంలో వస్తున్న సమయంలో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, కొరటాల లు కలిసి మహేష్ కు బుకే అందిస్తూ కనిపించారు.
కాగా నేడు మహేష్ పెళ్లిరోజు అట. ఈ నేపథ్యంలోనే మహేష్ కు విషెస్ చెప్తూ వారు బుకే అందజేశారు. ఇక ఇందులో మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ లో వైట్ షర్ట్ బ్లూ ఫాంట్ తో కనిపించాడు.
అలాగే మరోవైపు మహేష్ భార్య నమ్రత కూడా ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ వారి వివాహబంధం గురించి చెప్పుకోచింది.
Advertisements