సినిమాల్లో అడుగు పెట్టిన తర్వాత ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అగ్ర హీరోల నుంచి చిన్న చిన్న నటుల వరకు ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మాత్రం కెరీర్ చాలా బాగుంటుంది. కాని కొందరు వ్యక్తిగత జీవితం నుంచి వ్రుత్తి వరకు ఏ మాత్రం జాగ్రత్తలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలా జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.
అలా చేసుకున్న వారిలో చిరంజీవి సన్నిహితుడు హరిప్రసాద్ ఒకరు. కమెడియన్ సుధాకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరి ప్రసాద్, నారాయణ రావుతో చిరంజీవి చెన్నైలోని టీ నగర్ లో ఉండే వారు. చిరంజీవి తన ఇమేజ్ ను పెంచుకుంటూ మంచి సినిమాలు చేస్తున్న సమయంలో డైనమిక్ మూవీస్ అనే ఒక బ్యానర్ స్థాపించి యముడికి మొగుడు సినిమా తీసి మంచి హిట్ కొట్టారు. కాని లాభాలు అంతగా రాలేదు.
సుధాకర్ తో పాటు నారాయణ రావు సినిమాల్లో సెట్ అయ్యారు. కాని హరిప్రసాద్ మాత్రం హీరోగా ట్రై చేసి షాక్ తిన్నారు. చిన్న వయసులోనే తండ్రి పాత్రల్లో నటించిన ఆయన కన్నడలో నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు. ఈ తరుణంలో ఆయనకు ఒక షాక్ తగిలింది. మాధవితో ఒక సినిమా ప్లాన్ చేసాడు. ఆ సినిమా షూటింగ్ లో ఉండగా ఆమె నిర్మాతకు దర్శకుడికి చెప్పకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది.
అప్పటికే హరిప్రసాద్ ఆ సినిమా కోసం తన సంపాదనతో పాటుగా బయట అప్పులు కూడా తెచ్చి ఖర్చు చేసారు. కాని ఆమె సినిమా షూటింగ్ కోసం రాలేదు. ఎప్పటికో వచ్చి ఆ సినిమా పూర్తి చేసినా… అనుకున్న విధంగా సినిమా హిట్ అవ్వలేదు. దీనితో ఆయన రోడ్డున పడ్డాడు.