మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా ఆయన మాత్రం నటనలో ఎక్కడా గ్రేస్ తగ్గకుండా నటిస్తున్నారు. యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూనే సీనియర్ దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంచితే గాడ్ ఫాదర్ సినిమాను చాలా జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. సీనియర్ దర్శకుడు మోహన్ రాజా… లూసిఫర్ సినిమా కథను తెలుగుకి తగిన విధంగా ఆకట్టుకునే విధంగా మార్చడంతో ఆయనతో సినిమా చేసారు. ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ మరో బలం అయ్యారు. మసూం భాయి పాత్రను ఆయన పోషించారు. పారితోషికం ఇచ్చినా సరే వద్దని చెప్పేశారు అని టాక్.
పారితోషికం పంపిస్తే సల్మాన్ వద్దు అనడంతో ఖరీదైన కారు పంపాలని ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. దాదాపు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే కారుని సల్మాన్ కి గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఆర్డర్ కూడా ఇచ్చారని టాక్. దీపావళి కానుకగా ఆ కారుని సల్మాన్ కి స్వయంగా చిరంజీవి ఇస్తారని తెలుస్తుంది. ఏది ఎలా ఉన్నా చిరంజీవికి మాత్రం గాడ్ ఫాదర్ మర్చిపోలేని హిట్.