అమితాబ్.. ‘సైరా’ షూట్‌కి బ్రేక్!

చిరంజీవి- నయనతార జంటగా రానున్న మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం షూటింగ్‌కి యూనిట్ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా షూట్‌కి హాజరయ్యాడు బిగ్ బీ అమితాబ్. ఆ తర్వాత కొన్ని ఫోటోలను ఆయన విడుదల చేశాడు. ఆ విషయం కాసేపు పక్కనబెడితే.. అమితాబ్ సన్నివేశాల చిత్రీకరణ తర్వాత మూవీ ముందుకెళ్లలేదని సమాచారం.


సైరా.. ఫస్ట్ షెడ్యూల్ రెండునెలల కిందటే ఆగినప్పటికీ అమితాబ్ గెస్ట్ అప్పీరియెన్స్ షూట్ కోసం మళ్లీ మొదలైంది. అలా కొనసాగించాలని యూనిట్ ప్లాన్ చేసినప్పటికీ అమితాబ్ స్లాట్ ముగియగానే ప్యాకప్ చేయాల్సివచ్చింది. చిరంజీవి అమెరికా ట్రిప్ సైరా బ్రేకప్‌కి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ లెక్కన ‘సైరా’ వచ్చేఏడాది సమ్మర్‌కి రిలీజ్ కావచ్చని అంటున్నారు. చిరు కెరీర్‌లో చేస్తున్న ఫస్ట్ హిస్టారికల్ ఫిల్మ్ ఇది. సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కి రామ్‌చరణ్ ప్రొడ్యూసర్.