టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవి సక్సెస్ఫుల్ ఫిలిం డైరెక్టర్ బాబీ కాంబోలో వాల్తేర్ వీరయ్యగా సంక్రాంతి బరిలోకి దిగుతాడని మెగా అభిమానులు ధీమాగా ఉన్నారు. మరోవైపు అఖండ విజయాన్ని అందుకున్న అన్ స్టాప’బుల్’ బాలయ్య కూడా సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర తొడకొట్టబోతున్నాడు.
ఈ రెండుసినిమాలను నిర్మిస్తున్న ప్రతిష్టాత్మాక నిర్మాణసంస్థ మైత్రీమూవీసే కావడం తెలిసిందే. అయితే నల్లచొక్కాతో బాలయ్య, గళ్ళలుంగీతో వీరయ్యా ఒకేసారి సంక్రాతికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం మీద నిర్మాణ సంస్థకు ఎలాంటి దిగులు లేకపోయినా ఇండస్ట్రీలో మాత్రం టాక్ నడుస్తుంది.
ఈ నేపథ్యంలో వీరయ్యను సంక్రాంతికి కాకుండా మరోరోజు దించుదామనే ఆలోచనతో మైత్రీమూవీస్ ఉందనే టాక్ కూడా బైటకు వచ్చింది. ఈ వార్తమెగా అభిమానులకు నిరుత్సాహపరిచే విషయం.మరి సంక్రాంతికి చిరు అభిమానుల వీరయ్యగా వీలు చూసుకుని వస్తాడా ? వీలు చేసుకుని వస్తాడా ? అనేది వేచిచూడాలి.!