బప్పి లహరి మంగళవారం రాత్రి ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. బప్పి భారతీయ చలనచిత్రంలో సింథసైజ్డ్ డిస్కో సంగీతాన్ని ఉపయోగించడాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. కాగా బప్పి మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లోకి త్రో బ్యాక్ ఫోటో ను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.
బప్పితో నాకు గొప్ప అనుబంధం ఉంది. నా కోసం చాలా మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ ఇచ్చారు. అది నా చిత్రాల ఆదరణకు ఎంతగానో దోహదపడింది. అతని సన్నిహితులు మరియు ప్రియమైన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
బప్పి చిరంజీవి స్టేట్ రౌడీ (1989), గ్యాంగ్ లీడర్ (1991), రౌడీ అల్లుడు (1991) బిగ్ బాస్ (1995) వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించారు బప్పి.
తెలుగులో మొదటి సారిగా 1986లో వచ్చిన సింహాసనం కు సంగీతం అందించారు బప్పి. కృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ చిత్రాలకు కూడా బప్పి సంగీతం అందించారు.