హీరోయిన్ త్రిష పుట్టిన రోజు ఈ రోజు. అయితే ఈ సందర్భంగా సినిమా తారలందరూ కూడా త్రిషకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ నేపథ్యంలోనే మెగా స్టార్ చిరంజీవి కూడా విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. ‘జన్మదిన శుభాకాంక్షలు త్రిష. నీ జీవితం సంతోషం, విజయంతో నిండిపోవాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. దీనికి త్రిష రిప్లై ఇచ్చారు.
‘స్వీటెస్ట్ లెజెండ్ చిరంజీవికి ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న ‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకున్న తర్వాత త్రిషకు, చిరుకు మధ్య జరిగిన సంభాషణ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక త్రిష ప్లేస్ లో కాజల్ ను చిత్ర యూనిట్ తీసుకున్న సంగతి తెలిసిందే.